ఎన్టీఆర్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్

Published on Mar 5, 2023 1:20 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో రూపొంది రిలీజ్ తరువాత వరల్డ్ వైడ్ సంచలన విజయం అందుకున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఇక వందల కోట్ల కలెక్షన్స్ తో పాటు గ్లోబల్ గా ఆడియన్స్ మనసుని ఆకట్టుకున్న ఈ మూవీకి ప్రస్తుతం పలు అంతర్జాతీయ అవార్డులు కూడా లభిస్తున్నాయి. అతి త్వరలో జరుగనున్న ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో జరుగనున్న ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఇప్పటికే అమెరికా చేరుకున్న రామ్ చరణ్, ఎప్పటికప్పుడు అక్కడి మీడియా తో ఇంటరాక్ట్ అవుతుండడంతో పాటు పలు విధాలుగా ఫ్యాన్స్ ని కలుస్తున్నారు.

లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ అయిన సందర్భంగా యుఎస్ఏ లోని థియేటర్ లో సందడి చేసిన చరణ్, ఫ్యాన్స్ పలు సన్నివేశాల్లో లేచి నిలబడి తమ సీన్స్ ని అభినందించిన తీరుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. ఇక లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా పలు ఆర్ఆర్ఆర్ తో పాటు తన స్నేహితుడు ఎన్టీఆర్ గురించి పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు రామ్ చరణ్. మగధీర కి మాత్రమే కాదు ఆర్ఆర్ఆర్ కి కూడా తాను స్టూడెంట్ నే అని, రాజమౌళి గారిని కలిసిన ప్రతి సారి ఎంతో నేర్చుకున్నానని, నిజానికి ఆర్ఆర్ఆర్ కి ముందు కొంత గ్యాప్ తీసుకుందాం అని భావించినప్పటికీ అదే సమయంలో ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి కలిసారని అన్నారు.

ఇక తన సోదర సమానుడు ఎన్టీఆర్ ని తాను ఈ సందర్భంగా మిస్ అవుతున్నానని అన్నారు. కారణాలు చెప్పలేనప్పటికీ ఇన్నేళ్ల పాటు తాను ప్రత్యేకంగా ఎన్టీఆర్ తో ఎక్కువుగా ఇంటరాక్ట్ అవ్వలేకపోయానని, ఇద్దరం కలిసి ఆర్ఆర్ఆర్ చేసిన సమయంలో మా ఇద్దరి మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఏర్పడిందని అన్నారు. మా ఇద్దరినీ హీరోలుగా పెట్టి ఆర్ఆర్ఆర్ తీసినందుకు రాజమౌళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కి ప్రత్యేక పనులు ఉండడం వలన ఇక్కడికి రాలేదని, తాను ఎప్పటికీ నా ప్రక్కనే ఉండాలని కోరుకుంటున్నానని చరణ్ అన్నారు.

సంబంధిత సమాచారం :