ఆస్కార్ అవార్డు ఇంటికి వస్తోంది – రామ్ చరణ్

Published on Mar 13, 2023 12:01 pm IST

గ్లోబల్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు గెలుపొందడం పట్ల ఎమోషనల్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎప్పటికీ స్పెషల్ మూవీ గా మా జీవితాల్లో, ఇండియన్ సినిమా చరిత్రలో ఉంటుంది. ఇంకా డ్రీమ్ లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు అందించిన ప్రేమకు థాంక్స్. ఎస్ ఎస్ రాజమౌళి గారు, ఎంఎం కీరవాణి గారు భారతీయ సినీ పరిశ్రమ కి విలువైన రత్నాలు. నాటు నాటు అనేది వరల్డ్ వైడ్ గా ఒక ఎమోషన్.

లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ లకు థాంక్స్. నా కో స్టార్, బ్రదర్ ఎన్టీఆర్ మనం మళ్ళీ కలిసి డాన్స్ చేసి, రికార్డ్స్ క్రియేట్ చేయాలనీ కోరుకుంటున్నా, థాంక్యూ అలియా భట్. ఈ అవార్డ్ ప్రతి ఒక్క ఇండియన్ నటుడు కి, సాంకేతిక నిపుణుడికి, సినిమాకి వెళ్ళే వారికి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఇండియన్ మూవీ గా గెలిచాం అని, ఆస్కార్ అవార్డు ఇంటికి వస్తోంది అని అన్నారు. అవార్డ్ గెలుచుకున్న వీడియో ను కూడా షేర్ చేశారు రామ్ చరణ్.

సంబంధిత సమాచారం :