రామ్ చరణ్, కేటిఆర్ చేతుల మీదుగా చిన్న సినిమా ఆడియో !
Published on Jun 1, 2017 4:00 pm IST


ఇటీవలే స్టార్ హీరోయిన్ చేతుల సమంత చేతుల మీదుగా సాంగ్ లాంచ్ జరుపుకుని అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం ‘కాదలి’. ఈ సినిమా యొక్క ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ యొక్క ఆడియో వేడుక ఈ నెల 3వ తేదీన జరగనుంది.

ఈ వేడుకకు స్టార్ హీరో రామ్ చరణ్, ప్రముఖ రాజకీయ నాయకుడు కేటిఆర్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. వీరి చేతుల మీదుగానే ఆడియో రిలీజ్ జరగనుంది. చిన్న ప్రాజెక్ట్ గా మొదలైన ఈ చిత్రం ఇలా సెలబ్రిటీల ప్రెజెన్స్ తో మెల్లగా గుర్తింపును పెంచుకుంటోంది. పట్టాభి. ఆర్. చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజ కె. దోషి, సాయి రోనక్, హరీష్ కళ్యాణ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనగనగా ఫిల్మ్ కంపెనీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ జూన్ నెలలోనే విడుదల చేసే అవకాశాలున్నాయి.

 
Like us on Facebook