శంకర్ సినిమా కోసం మరో క్రేజీ లుక్ లోకి మారిన చరణ్.!

Published on Feb 12, 2023 7:01 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇందులో కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక శంకర్ సినిమా అంటే ఏ లెవెల్లో ఉంటుందో ఆ అన్ని అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా అనేక హంగులతో తెరకెక్కుతుంది. అలాగే హీరో రామ్ చరణ్ ని కూడా పలు డిఫరెంట్ లుక్స్ లో అయితే శంకర్ ప్రెజెంట్ చేస్తున్నారు.

వాటిలో చరణ్ ని మంచి అల్ట్రా స్టయిలిష్ లుక్ లో కూడా చూపించారు. అయితే నెక్ట్స్ చరణ్ లాంగ్ హెయిర్ పెంచి సినిమా చేసాడు. కానీ ఇప్పుడు తన హెయిర్ స్టైలిస్ట్ అలీంహకిమ్ సరికొత్త హెయిర్ స్టైల్ లుక్ ని అయితే చరణ్ కోసం ప్రిపేర్ చేసాడు. మరి దీనిని కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సూపర్ డూపర్ స్టార్ రామ్ చరణ్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నానని తెలిపాడు. మరి ఈ సరికొత్త లుక్ లో చరణ్ మరింత స్టైలిష్ గా కనపడుతున్నాడని చెప్పాలి. దీనితో చరణ్ ఈ సరికొత్త అవతార్ తన ఫ్యాన్స్ కి ఇప్పుడు మంచి కిక్ ఇస్తుంది. ఇక దీనితో చరణ్ అయితే చార్మినార్ షెడ్యూల్ లో జాయిన్ కానున్నాడు.

సంబంధిత సమాచారం :