లేటెస్ట్..శంకర్ సినిమాలో మిస్టర్ బాక్సాఫీస్ క్రేజీ లుక్ వైరల్.!

Published on Jul 2, 2022 1:59 pm IST

ప్రస్తుతం మిస్టర్ బాక్సాఫీస్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ సినిమా దగ్గరా మరో టాప్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో తమ కెరీర్ లో 15వ సినిమాగా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమాపై భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దర్శకుడు రామ్ చరణ్ ని ఊహించని లుక్స్ లో చూపిస్తూ ప్రెజెంట్ చెయ్యడం ఎప్పటికప్పుడు ఆసక్తిగా మారుతుండగా..

ఇప్పుడు తాజాగా చరణ్ ని మరో స్టన్నింగ్ లో సిద్ధం చేసినట్టుగా చరణ్ పర్సనల్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చిన్న గ్లింప్స్ లా ఆ లుక్ ని రివీల్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మరి ఈ చిన్న లుక్ లో కూడా చరణ్ మంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. దీనితో ఇప్పుడు ఈ క్రేజీ లుక్ మాత్రం మంచి వైరల్ గా మారిపోయింది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు నార్త్ ఇండియా లో జరుగుతుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దిల్ రాజు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :