రామ్ చరణ్ లేటెస్ట్ స్టన్నింగ్ లుక్స్ వైరల్..!

Published on Jun 15, 2022 7:05 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ జేమ్స్ క్యామెరున్ శంకర్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరి కెరీర్ లో కూడా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 15వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ప్రస్తుతం చరణ్ కొద్దిగా బ్రేక్ లో ఉన్నాడు. ఈ గ్యాప్ లో చరణ్ మరియు ఉపాసనాల 10వ పెళ్లిరోజు వేడుకలు రావడంతో ఈ స్పెషల్ డే ని ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.

అయితే లేటెస్ట్ గా చరణ్ మరియు ఉపాసన లు ఒక ఫోటో షూట్ చేసుకొని ఆ ఫొటోస్ షేర్ చెయ్యగా అందులో చరణ్ లుక్స్ ఆసక్తి గా మారాయి. ఆ సూట్ చరణ్ మంచి డాషింగ్ గా శంకర్ సినిమా కోసం పెంచిన హెయిర్ స్టైల్ తో మరింత స్టన్నింగ్ గా కనిపిస్తున్నాడు. దీనితో చరణ్ లేటెస్ట్ లుక్స్ చూసిన వారు అయితే మాత్రం మంచి హై ఫీలవుతున్నారు.

సంబంధిత సమాచారం :