డాషింగ్ అండ్ స్టైలిష్ గా చరణ్ లేటెస్ట్ లుక్స్ వైరల్.!

డాషింగ్ అండ్ స్టైలిష్ గా చరణ్ లేటెస్ట్ లుక్స్ వైరల్.!

Published on Oct 28, 2022 6:17 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఇప్పుడు ఉన్న గ్యాప్ లో తన లాస్ట్ భారీ హిట్ “రౌద్రం రణం రుధిరం” చిత్రం జపాన్ రిలీజ్ ప్రమోషన్స్ కోసం గాను రిలీజ్ కి అక్కడికి వెళ్లగా నెక్స్ట్ అయితే తన ఫ్యామిలీ తో వెకేషన్ లో ఉన్నాడు. ఇక ఈ సమయంలో అయితే మెగాపవర్ స్టార్ లేటెస్ట్ లుక్స్ అయితే మంచి వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలు బయటకి రాగా మరి వీటిలో చరణ్ అయితే మంచి డాషింగ్ అండ్ స్టైలిష్ గా ఉన్నాడని చెప్పాలి. శంకర్ సినిమా కోసం ప్రిపేర్ చేసిన హెయిర్ స్టైల్ తో లైట్ గడ్డంలో కనిపిస్తున్నాడు. దీనితో తన లేటెస్ట్ లుక్స్ ఇపుడు అభిమానుల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నెక్స్ట్ అయితే చరణ్ ఇక్కడకొచ్చి బ్యాలన్స్ షూటింగ్ లో పాల్గొననున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు