వైరల్ పిక్ : HT లీడర్షిప్ సమ్మిట్ లో ట్రెండీ లుక్స్ తో అదరగొట్టిన రామ్ చరణ్

వైరల్ పిక్ : HT లీడర్షిప్ సమ్మిట్ లో ట్రెండీ లుక్స్ తో అదరగొట్టిన రామ్ చరణ్

Published on Nov 13, 2022 12:08 AM IST


టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకదిగ్గజం శంకర్ తో RC15 మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్.

అయితే అక్కడక్కడా పలు ముఖ్యమైన ఈవెంట్స్, ఫంక్షన్స్ లో సందడి చేసే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు ఢిల్లీ లో జరిగిన HT లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇక ఈ సమ్మిట్ లో లేటెస్ట్ స్టైల్ ట్రెండీ లుక్స్ కలిగిన కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అందరి చూపుని తనవైపుకు తిప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితం నుండి రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు