శంకర్ మాస్ సంభవం..చరణ్ డైనమిక్ లుక్ వైరల్.!

Published on Mar 23, 2023 4:31 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో గ్లోబల్ స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. మరి రామ్ చరణ్ అయితే ఇప్పుడు తన క్రేజ్ ని మరింత స్థాయిలో పెంచుకుంటూ వెళ్తుండగా ఇప్పుడు అయితే మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ సాలిడ్ సోషల్ డ్రామా ని చేస్తున్నాడు. మరి ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాతో ఖచ్చితంగా శంకర్ నుంచి తన రేంజ్ మాస్ కం బ్యాక్ ఇస్తారని గట్టి టాక్ ఉంది.

ఇక ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో యంగ్ రోల్ లో శంకర్ చరణ్ కి ప్లాన్ చేసిన లుక్స్ చూసి ఫ్యాన్స్ కి అయితే గట్టి ట్రీట్ ఖాయం అన్నట్టుగా అనిపిస్తుంది. మరి రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయగా ఇపుడు చరణ్ పిక్ అయితే ఒకటి బయటకి వచ్చింది.

మరి ఇందులో తన హెయిర్ స్టైల్ గాని మెడలో ఓ తాడు లాంటిది డ్రెస్సింగ్ అంతా సినిమాలో ప్రిపేర్ చేసినదే అన్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. దీనితో డైనమిక్ గా కనిపిస్తున్న ఈ లుక్ ఫ్యాన్స్ లో క్రేజీ గా మారింది. ఖచ్చితంగా తమ హీరోతో శంకర్ మాస్ సంభవం చూస్తామని గట్టిగా మెగా ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయ్యిపోయారు. ఇక ఈ మార్చ్ 27 న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సెన్సేషనల్ కాంబో నుంచి టైటిల్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :