చిరు పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mar 13, 2023 7:01 am IST

ఆస్కార్‌ వేడుకకు హాజరయ్యే ముందు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అమెరికాలోని మెగా అభిమానులను ప్రత్యేకంగా కలిశారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. ముఖ్యంగా తనను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మెగా ఫ్యాన్స్‌కు చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సందర్భంగా చరణ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో చరణ్ మాటల్లోనే విందాం.

చరణ్ మాట్లాడుతూ.. ‘మెగా అభిమానుల ప్రేమాభిమానాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే మిమ్మల్ని ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకుంటాను. మేము ఇలా ఉన్నామంటే మీ అందరి అభిమానమే కారణం. తెలుగు వాళ్లుగా మనం ‘ఆర్ఆర్‌ఆర్‌’తో చరిత్ర సృష్టించాం. అందులో మీరంతా భాగమే. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సూపర్‌ హిట్‌ అయిన సందర్భంగా నాన్న గారు మీరందరితో వీడియోలో మాట్లాడారు. ఒక్క ఆయనకు మాత్రమే ఇలాంటి ఐడియాలు వస్తాయి. మేము ఎంత అప్‌డేట్‌గా ఆలోచిస్తున్నాం అనుకున్నా.. ఆయన, మాకంటే అన్నిటిలోనూ ఓ అడుగు ముందే ఉన్నారు’ అని రామ్‌ చరణ్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :