లేటెస్ట్..ఆస్కార్స్ లో మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ పేరు.!

Published on Sep 16, 2022 10:06 am IST

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర ప్రైడ్ పాన్ ఇండియా సినిమాగా “రౌద్రం రణం రుధిరం” చిత్రం నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు బిగ్గెస్ట్ స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ వైడ్ ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా తెచ్చుకోని రేంజ్ రీచ్ ని స్పందనను తెచ్చుకుంది.

దీనితో హాలీవుడ్ సినిమాలతో కూడా పోటీ పడిన ఈ సినిమాలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ లకు గాను గ్లోబల్ గా నెక్స్ట్ లెవెల్ రీచ్ వచ్చింది. ఇక అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాల లిస్ట్ లో RRR కి ఆస్కార్ అవార్డు కూడా రావాలని మనం కాదు ఇంటర్నేషనల్ ఆడియెన్స్ నే ఎంతగానో డిమాండ్ చేస్తూ వచ్చారు.

ఇక ఆ గ్యాప్ లో మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ప్రముఖ మ్యాగజైన్ ‘వెరైటీ’ లో ప్రచురించడం సెన్సేషన్ గా మారింది. మరి ఇప్పుడు మళ్ళీ కొన్ని ప్రిడిక్షన్స్ రాగా ఈసారి మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ పేరు కూడా బెస్ట్ యాక్టర్ జాబితాలో నిలిచింది. దీనితో ఇపుడు రామ్ చరణ్ పేరు కూడా వైరల్ గా మారింది. మరి ఈ ప్రిడిక్షన్స్ నిజం అయ్యి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :