రామ్ చరణ్ సినిమాకు ముహూర్తం ఖరారు !

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘రంగస్థలం 1985’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్. మార్చిలో ఈ సినిమా విడుదల కానుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

రామ్ చరణ్ ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటివల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ కు సంభందించి రకరకాల పేర్లు వినిపిస్తోన్న ఇంకా ఎవ్వరు ఖరారు కాలేదు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.