చరణ్ న్యూ లుక్ ఆ సీక్వెన్స్ కోసమే

చరణ్ న్యూ లుక్ ఆ సీక్వెన్స్ కోసమే

Published on Feb 14, 2023 2:23 AM IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యూ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సరికొత్త హెయిర్ స్టైల్‌తో చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. సెలబ్రిటీల హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్ చరణ్‌ కొత్త హెయిర్ స్టైల్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఐతే, ఈ లుక్ ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో రివీల్ అవుతుందట. చరణ్ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా ఈ లుక్ లోనే రివీల్ అవుతుందట.

ఈ సినిమా పీరియాడిక్ పొలిటికల్ డ్రామా. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. ఐతే ఈ సినిమాలో ఓ విప్లవ నాయకుడి పాత్ర ఉందని, ఈ పాత్ర చరణ్ పాత్రకు గురువు పాత్ర అని.. పోరాటం ద్వారానే దేశంలో అవినీతిని తరిమి కొట్టవచ్చు అని నమ్మి, అది ఆచరణలో పెట్టే నాయకుడు పాత్ర అని.. ఈ పాత్ర కోసం ఓ సీనియర్ హీరో కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు