మరో దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అయిన రామ్ చరణ్?

Published on Jan 11, 2022 3:02 am IST

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన “ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ వాయిదా పడడంతో, తన తదుపరి సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తూనే, తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

అయితే ఈ సినిమాలా అనంతరం మరో దర్శకుడితో సినిమా చేసేందుకు రామ్ చరణ్ రెడీ అయినట్టు తెలుస్తుంది. నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’తో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించనున్నట్టు టాక్ నడుస్తుంది. కాగా దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

సంబంధిత సమాచారం :