స్పై ఏజెంట్ గా రామ్ చరణ్ !

21st, January 2017 - 09:39:08 AM

ram-charan
హీరోగా ‘ధృవ’ నిర్మాతగా ‘ఖైదీ నెం 150’ వంటి భారీ సక్సెస్లను అందుకున్న నటుడు రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై కసరత్తులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా తనకు కలిసొచ్చిన పోలీస్ తరహా కథనే ఒకదాన్ని చరణ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నాడట. తాజాగా ఖైదీ సక్సెస్ సందర్బంగా అభిమానులతో ఇంటరాక్ట్ అయిన చరణ్ తన నెక్స్ట్ సినిమా స్పై ఏజెంట్ కథగా ఉంటుందని చెప్పారట.

అయితే ఈ కథని తాజాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడని సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో క్రిష్ మహేష్, వెంకటేష్, చరణ్ లకు కథలను రూపొందిస్తున్నానని అన్నారు. పైగా వరుణ్ తేజ్ తో చేయవలసిన స్పై థ్రిల్లర్ ‘రాయబారి’ చిత్రం కూడా పోస్ట్ పోన్ అయింది. వీటన్నింటినీ బట్టి క్రిష్ ఆ రాయబారి కథను చరణ్ కు అనుగుణంగా మారుస్తున్నాడని అంటున్నారు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం సిద్దమవుతున్న సుకుమార్ సినిమా పూర్తవగానే ఈ స్పై థ్రిల్లర్ సినిమాని మొదలుపెడతారట.