100 కోట్ల రెమ్యునరేషన్‌పై రామ్ చరణ్ క్లారిటీ..!

Published on Dec 31, 2021 3:02 am IST

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో పాటు కొరటాల శివ ‘ఆచార్య’ చిత్రంలో తండ్రితో కలిసి స్క్రీన్ షేర్‌ చేసుకోనున్నాడు. మరోవైపు నిర్మాతగానూ సత్తాచాటుతున్నాడు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల నుంచి రామ్‌ చరణ్‌ తన నెక్స్ట్ సినిమాలకు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న చరణ్‌కు ఈ రెమ్యునరేషన్ గురుంచిన ప్రశ్న ఎదురయ్యింది. దీనికి రామ్ చరణ్ నవ్వుతూ అవన్నీ నిరాధారమైన రూమర్స్ అని కొట్టిపారేశారు. ఈ 100 కోట్లు ఎక్కడివి, నాకు ఎవరు ఇస్తున్నారని చరణ్ చమత్కరించాడు. దీంతో చరణ్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది.

సంబంధిత సమాచారం :