నార్త్ లో ‘పెద్ది’ ఒక టెన్షన్ తగ్గినా గట్టి పోటీ తప్పేలా లేదు!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాని మార్చ్ 27 రిలీజ్ కి ముందు ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా మరో నెల రోజుల పాటు వాయిదా వేశారు.

అయితే ఈ వాయిదాతో నార్త్ మార్కెట్ పరంగా ధురంధర్ ఎఫెక్ట్ నుంచి ఈ సినిమా కొంచెం సేఫ్ అయినట్టే అని చాలా మంది భావించారు కానీ ఆ ఒక్క సినిమా కాకుండా ఏప్రిల్ 30 డేట్ కి షిఫ్ట్ అయ్యిన సమయంలో మాత్రం ముందు, వెనుక మరిన్ని సినిమాలు దీనికి పోటీగా ఉన్నాయి.

ఏప్రిల్ నెల లోనే సల్మాన్, అక్షయ్ కుమార్ ల సినిమాలు వారం, వారం గ్యాప్ లో ఉండగా పెద్ది రిలీజ్ తర్వాతే రాజా శివాజీ అనే భారీ సినిమా కూడా ఉంది. ఇలా నార్త్ ఇండియా మార్కెట్ లో మంచి ఇంపాక్ట్ చూపించే సినిమాలు తోనే ఈ సినిమా పోటీకి దిగబోతుంది. సో పెద్ది సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ అక్కడ అందుతుందో చూడాలి.

Exit mobile version