మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమానే “పెద్ది”. తన గత చిత్రం గేమ్ ఛేంజర్ ఊహించని రీతిలో ప్లాప్ కావడంతో చరణ్ పెద్ది మాత్రం పెద్ద హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పలు వాయిదాలు తర్వాత ఫైనల్ గా సినిమా గ్రాండ్ రిలీజ్ కి ఇప్పుడు సిద్ధం కాగా ఈ గ్యాప్ లో మాత్రం పెద్ది భారీ డిమాండ్ ని తెలుగు స్టేట్స్ లో చూస్తున్నట్టు తెలుస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది థియేట్రికల్ బిజినెస్ ఎంత చెబితే అంత వెళుతున్నట్టు టాక్. ఇది వరకే సీడెడ్, గోదావరి జిల్లాల్లో పెద్ది భారీ బిజినెస్ ని జరిపినట్టు తెలిపాము. కానీ ప్రస్తుతం ట్రేడ్ లో పెద్ది హవా మరింత ఎక్కువైనట్టు తెలుస్తుంది. చాలా కాలం నుంచి సరైన సినిమాలు లేకపోవడంతో పెద్ది పైనే అంతా అసలు పెట్టుకున్నారు.
దీనితో ఈ సినిమా మ్యాజిక్ చేస్తుందనే నమ్మకంగా భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారట. చిత్ర యూనిట్ కూడా సినిమా విషయంలో అంతే నమ్మకంగా ఉన్నారు మరి. సో పెద్ది మార్కెట్ అండ్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాల్సిందే. అది తెలియాలి అంటే ఈ జూన్ 4 వరకు ఆగాలి.
