ఓవర్సీస్ మార్కెట్ లో ‘పెద్ది’ గాడి ర్యాంపేజ్!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన సినిమానే “పెద్ది”. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మల్టీ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా భారీ ఓపెనింగ్స్ ని ఇపుడు సొంతం చేసుకుంది. అయితే తెలుగు రాష్ట్రాలు సహా ఇండియా వైడ్ గా స్ట్రాంగ్ బుకింగ్స్ చూస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఉతికారేస్తుంది.

యూఎస్ మార్కెట్ లో సెన్సేషనల్ మార్క్ 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని కేవలం ప్రీమియర్స్ తోనే దాటేసిన ఈ సినిమా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో కూడా భారీ వసూళ్లు రాబడుతుంది. ఇలా అక్కడ నుంచి లక్ష యాభై వేల డాలర్స్ మార్క్ ని పెద్ది ఇపుడు దాటేసి ఒక స్ట్రాంగ్ నోట్ తో మొదలు అవుతుంది. టాక్ ఎలాగో బాగానే ఉంది కాబట్టి సాలిడ్ లాంగ్ రన్ ఈ సినిమాకి దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో జగపతిబాబు, శివ రాజ్ కుమార్ తదితరులు నటించగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version