గేమ్ మారబోతోంది.. చరణ్ క్రేజీ పోస్ట్

గేమ్ మారబోతోంది.. చరణ్ క్రేజీ పోస్ట్

Published on Jul 8, 2024 10:33 AM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్‌. ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఈ మైలురాయికి గుర్తుగా, రామ్ చరణ్ ఈ ఉదయం ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పంచుకున్నారు. చరణ్ హెలికాప్టర్ల వైపు నడుస్తున్న రెండు చిత్రాల కోల్లెజ్‌ను పోస్ట్ చేశారు, ఒకటి సినిమాలోనిది, మరొకటి షూట్ పూర్తయిన తర్వాత తీసిన పిక్. పైగా ఈ పిక్స్ కి “గేమ్ మారబోతోంది” అని క్యాప్షన్ కూడా చరణ్ ఇచ్చాడు.

అదేవిధంగా, ‘మా “గేమ్‌ఛేంజర్” రామ్‌చరణ్ షూటింగ్ మొదటి రోజు నుండి చివరి వరకు ఇది మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ. షూటింగ్ ముగిసింది. త్వరలో మీకు కొన్ని సాలిడ్ అండ్ క్రేజీ అప్‌డేట్‌లను తీసుకువస్తున్నాము’ అంటూ చిత్రబృందం కూడా ఒక పోస్ట్ పెట్టింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

అలాగే, ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు