గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా వచ్చి ఊహించిన రేంజ్ హిట్ కాలేకపోయింది.
ఇక అంచనాలు అన్నీ నెక్స్ట్ చేస్తున్న బుచ్చిబాబు సానా సినిమా పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది.
లేటెస్ట్ గానే సినిమాలో కీలక మూడో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ షెడ్యూల్ లో మెయిన్ లీడ్ రామ్ చరణ్ అలాగే జాన్వీ కపూర్ లు పాల్గొనగా వీరితో పాటుగా కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కూడా త్వరలోనే పాల్గొననున్నారు అని తెలుస్తోంది.
ఇలా మొత్తానికి ఈ సినిమా పనులు మాత్రం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్, మైత్రిమూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.