RC15 నెక్స్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

RC15 నెక్స్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

Published on Nov 23, 2022 9:09 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని చిత్రీకరించేందుకు న్యూజిలాండ్ వెళ్లారు యూనిట్ సభ్యులు. అయితే అది పూర్తి అయిన అనంతరం డిసెంబర్ మొదటి వారంలో ఇక్కడికి తిరిగి రానున్న యూనిట్, అనంతరం డిసెంబర్ చివరి వారంలో మరొక షెడ్యూల్ జరుపనున్నారని, దానితో మూవీకి సంబంధించి టాకీ పార్టీ పూర్తి అవుతుందని తెలుస్తోంది. అనంతరం మూవీకి సంబంధించి బ్యాలెన్స్ వర్క్ ని కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో దీనిని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేలా యూనిట్ ప్లాన్ చేస్తోందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు