రాజ్ తరుణ్ “అనుభవించు రాజా” టీజర్ ను విడుదల చేయనున్న రామ్ చరణ్!

Published on Sep 22, 2021 7:15 pm IST


రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో, పోసాని కృష్ణమురళి, అజయ్, టెంపర్ వంశీ, ఆడుకాలం నరేన్, కాషిస్ ఖాన్, సుదర్శన్, అరియాన, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం అనుభవించు రాజా. ఈ చిత్రం కి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, విశేష ఆదరణ వచ్చింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 23 వ తేదీన ఉదయం 10:08 గంటలకు ఈ చిత్రం టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్త యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉంటుంది అనే దాని పై త్వరలో ఒక క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :