ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర నిడివి తగ్గించేశారా?

Published on Apr 16, 2022 3:02 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆచార్య”. ఇందులో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి 40 నిమిషాలు కాగా అందులో చిరంజీవితో 20 నుంచి 25 నిమిషాల దాకా సన్నివేశాలు ఉంటాయని వార్తలు వినిపించాయి

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివిని కొంచెం ట్రిమ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైం బాగా ఎక్కువగా అయిపోతూ ఉండడంతో రామ్ చరణ్ పాత్ర నిడివి తగ్గించేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర కేవలం ఒక ఎక్స్టెండెడ్ క్యమియో పాత్రగా మాత్రమే ఉండబోతోందని తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ మోస్ట్ ప్రెస్టేజియస్ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :