బన్నీ పుష్ప-2లో చరణ్ పాత్ర అదే ?

బన్నీ పుష్ప-2లో చరణ్ పాత్ర అదే ?

Published on Dec 12, 2022 8:00 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘పుష్ప 2’ గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక మాస్ డైలాగ్ లీక్ అయినట్లు వార్తలొస్తుండగా.. మరోపక్క ఈ సినిమాలో మరో స్టార్ హీరో కలెక్టర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని ఓ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది. పుష్ప-2లో రామ్‌ చరణ్ అతిథి పాత్ర అయిన కలెక్టర్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే మెగా అభిమానులకు పెద్ద పండగే.

ఇక గతంలో చెర్రీ, బన్నీ కలిసి ‘ఎవడు’ సినిమాలో నటించారు. అలాగే, పుష్ప 2లో ‘కేథరీన్ థెరీసా’ కూడా ఓ నెగిటివ్ పాత్రలో నటిస్తుంది. అదే విధంగా ఈ సినిమాలో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్ లోనే మనోజ్ బాజ్ పాయ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. కానీ, బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు