మిస్టర్ బాక్సాఫీస్ 15..అతని పైనే అన్ని ఆశలూ..!

Published on Oct 22, 2021 11:01 am IST

మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ హీరో గా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ రాజమౌళితో చేసిన “RRR” తో ఆ స్టాండర్డ్స్ ను సెట్ చేసుకున్న చరణ్ ఇక శంకర్ తో సినిమాతో రెడీగా ఉన్నాడు. దీనిపై కూడా భారీ అంచనాలు ఇప్పుడు నెలకొనగా ఎట్టకేలకు ఈ భారీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ నేటి నుంచి స్టార్ట్ అయ్యింది.

దీనితో ఈ స్పెషల్ డే తో సినిమా ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమాపై ఇన్ని అంచనాలు నెలకొనడానికి ప్రధాన కారణాల్లో చరణ్ తో పాటుగా శంకర్ కూడా ఒకరు. ఈ సినిమాతో కనుక శంకర్ అదిరే కం బ్యాక్ ఇస్తే చూద్దామని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చరణ్ అభిమానులు శంకర్ ఫలితాన్ని మరింత స్పెషల్ గా తీసుకున్నారు.

చరణ్ బాక్సాఫీస్ స్టామినాకి శంకర్ కనుక సరైన ప్రెజెంటేషన్ ఇవ్వగలిగితే ఈ సినిమా రిజల్ట్ ఇంకో లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు. అసలే దిల్ రాజు సంగతి తెలిసిందే పైగా వారి బ్యానర్ నుంచి 50వ సినిమా ఇది సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా పరంగా జాగ్రత్తగానే ఉంటారు సబ్జెక్టు కూడా గట్టిగానే ఉంటుందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :