చరణ్ క్లాసిక్ రీ రిలీజ్ కి సన్నాహాలు.!

Published on Nov 27, 2022 4:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో వారి కెరీర్ లో పలు భారీ హిట్స్ అందుకోగా వాటిలో కొన్ని సరిగ్గా రాణించకపోయిప్పటికీ ఆడియెన్స్ లో మాత్రం ఇప్పటికీ మంచి క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. మరి ఇలాంటి చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం “ఆరెంజ్” కూడా ఒకటి. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో చరణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ “మగధీర” తర్వాత తెరకెక్కినది కావడంతో నెక్స్ట్ లెవెల్ హైప్ తో వచ్చింది.

కానీ ఆ సమయంలో అయితే ఈ చిత్రం అడ్వాన్స్డ్ కథగా రాగా ఆడియెన్స్ కి ఎక్కకపోవడంతో ప్లాప్ అయ్యింది. కానీ అనూహ్యంగా నెక్స్ట్ మాత్రం ఆడియెన్స్ లో ఈ చిత్రానికి క్రేజ్ పెరిగి మంచి క్లాసిక్ గా నిలిచింది. ఇప్పటికీ ఫ్రెష్ గా ఉండే పాటలు, చరణ్ జీనీలియా ల కెమిస్ట్రీ సినిమాలో ప్రేమ కథ వంటివి మంచి హైలైట్ గా నిలిచాయి.

మరి దీనితో అయితే నిన్ననే ఈ సినిమా రిలీజ్ అయ్యి 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో నిర్మాత నాగబాబు ఈ సినిమాకి ఇప్పుడు ఉన్న రెస్పాన్స్ తో ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సినిమాని కూడా రీ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్స్ చేస్తున్నామని ఓ రోజు చూసి రిలీజ్ చేస్తామని ఓ గుడ్ న్యూస్ ని అందించారు. దీనితో ఇక ఈ మూవీ లవర్స్ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రానికి అయితే హరీష్ జై రాజ్ సంగీతం అందించగా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ప్రభు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :