టార్గెట్ సెట్ చేసిన రామ్ చరణ్!

12th, October 2016 - 09:50:02 AM

ram-charan-in
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ కోసం సినీ అభిమానులంతా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో చెప్పక్కర్లేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను నిన్న సాయంత్రం దసరా కానుకగా రామ్ చరణ్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్‌కు విడుదలైనప్పట్నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టినట్టేనన్న అభిప్రాయం టీజర్‌ చూసిన అభిమానుల నుంచి వినిపిస్తోంది.

ముఖ్యంగా రామ్ చరణ్ అదిరిపోయే పోలీసాఫీసర్ లుక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సురేందర్ రెడ్డి మార్క్ స్టైలిష్ షాట్స్, ఆ షాట్స్‌ను సరిగ్గా వాడుతూ కట్ చేసిన విధానం.. ఇలా టీజర్ ఆద్యంతం కట్టిపడేసేలా ఉంది. దీంతో కేవలం 14 గంటల్లోనే ఈ టీజర్ యూట్యూబ్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించేసింది. అదేవిధంగా ఈ టీజర్‌కు 21,000లకు పైనే లైక్స్ రావడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. “నీ స్నేహితుడెవడో తెలిస్తే, నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువెవడో తెలిస్తే, నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.” అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‌తో డిసెంబర్ నెలలో సూపర్ హిట్ కొట్టేందుకు రామ్ చరణ్ టార్గెట్ సెట్ చేసినట్లే కనిపిస్తోంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి