శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను భారీగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్లాన్లు చిత్ర యూనిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రానికి అధికారి అనే టైటిల్ ను డైరెక్టర్ శంకర్ ఖరారు చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనుండడం తో ఈ టైటిల్ కూడా అర్ధమవుతుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, సునీల్, శ్రీకాంత్ మరియు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత కాగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.