డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్!

Published on Sep 13, 2021 12:05 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో బిజీ గా మారిపోయారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ అయిన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య లో సిద్ద పాత్రలో నటిస్తున్నారు.

ఒక పక్క నటిస్తూనే సినిమాలను నిర్మిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా మూవీ ను అనౌన్స్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయారు. అయితే ఇప్పుడు సరికొత్తగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినట్లు తెలుస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రామ్ చరణ్ భారీ మొత్తం డిమాండ్ చేయగా, అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండియా లో ఓటిటి ల హవా నడుస్తోంది అని చెప్పాలి. దిగ్గజ ఓటిటి సంస్థల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒకటి. ఇందుకు బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ ను ఎన్నుకోవడం పట్ల రామ్ చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :