వైరల్ అవుతోన్న పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్‌తో రామ్ చరణ్ పిక్..!

వైరల్ అవుతోన్న పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్‌తో రామ్ చరణ్ పిక్..!

Published on Sep 3, 2022 12:00 AM IST


పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సినీ, మీడియా, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

నా మార్గదర్శక శక్తి, మా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బాబాయికి జన్మదిన శుభాకాంక్షలు అని రాశారు. అలాగే, చరణ్, పవన్ కళ్యాణ్ మరియు వైష్ణవ్ తేజ్ ఉన్న అందమైన పిక్ షేర్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు