ఫాదర్స్ డే రోజున రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్!

Published on Jun 19, 2022 11:30 pm IST

ఫాదర్స్ డే సందర్భం గా ప్రతి ఒక్కరూ తమ తండ్రి పై ప్రేమను చూపే ప్రయత్నం చేస్తున్నారు. సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు తమ ప్రేమ, అభిమానాన్ని చూపుతూ పోస్టులు చేస్తున్నారు. ఈ మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కి ఒక స్పెషల్ ఫోటో తో విష్ చేయడం విశేషం. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న తన చిన్ననాటి ఫోటో ను షేర్ చేశారు రామ్ చరణ్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ మూవీ గాడ్ ఫాదర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండగా, రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :