తన డైరెక్టర్ శంకర్ కి చరణ్ స్పెషల్ విషెష్.!

Published on Aug 17, 2021 4:18 pm IST


మన ఇండియన్ సినిమా అంత గర్వించదగ్గ అతి తక్కువ మంది స్టార్ దర్శకుల్లో తన సినిమాలతో ఆలోచనలతో ఇండియన్ జేమ్స్ కేమెరూన్ గా పేరు తెచ్చుకున్న విజనరీ దర్శకుడు శంకర్ కూడా ఒకరు. పాన్ ఇండియన్ లెవెల్లో ఎప్పుడో తన ముద్ర బలంగా వేసిన శంకర్ పుట్టినరోజు ఈరోజు కావడంతో దేశ వ్యాప్తంగా సినీ తారలు తమ విషెష్ ని తెలియజేస్తున్నారు.

అయితే ఇప్పుడు శంకర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తన నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేయడానికి సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మరి తన హీరో చరణ్ ఈరోజు శంకర్ కి తనదైన స్పెషల్ విషెష్ ని తెలియజేసారు. శంకర్ సర్ కి జన్మదిన శుభాకాంక్షలు అని త్వరలోనే మన సినిమా సెట్స్ లో మీట్ అవుదామని ఈ ఏడాది మీకు మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాని తెలియజేసాడు.

మరి శంకర్ మరియు చరణ్ కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం అయినటువంటి ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ బ్యానర్ లో కూడా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :