“గుడ్ లక్ సఖి” చిన్న సినిమా కాదు – రామ్ చరణ్

Published on Jan 27, 2022 1:01 am IST

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘గుడ్‌ లక్‌ సఖి’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర పాదిరి నిర్మించారు. జనవరి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ “గుడ్ లక్ సఖి” చిన్న సినిమా కాదని చాలా పెద్ద చిత్రం అని అన్నాడు. ఈ చిత్రానికి అద్భుతమైన టెక్నీషియన్లు పనిచేశారు. మహానటి కీర్తి సురేష్ నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు, అలాంటప్పుడు ఇది చిన్న సినిమా ఎలా అవుతుందని రామ్ చరణ్ అన్నాడు. సినిమాలో చిత్తూరు యాసను కీర్తి సురేష్‌ చాలా బాగా మాట్లాడిందని, భవిష్యత్తులో ఆమె మరిన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని కోరాడు. ఇక ఈ సినిమా కోసం పనిచేసిన మొత్తం నటీనటులు మరియు చిత్ర బృందానికి రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. ఈ శుక్రవారం థియేటర్లలో తన అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలని కోరారు.

సంబంధిత సమాచారం :