వైరల్ పిక్ : భార్య ఉపాసన తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్

వైరల్ పిక్ : భార్య ఉపాసన తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్

Published on Nov 3, 2022 9:56 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా శంకర్ దర్శకత్వంలో RC15 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని భారీ పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఇటీవల నటించిన పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ ఆర్ఆర్ఆర్ జపాన్ లో కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయింది.

ఈ సందర్భంగా అక్కడి ప్రమోషన్స్ కోసం భార్య ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లిన చరణ్, అనంతరం సౌత్ ఆఫ్రికా కి వెకేషన్ కి వెళ్లారు. అక్కడే భార్య ఉపాసన తో కలిసి కొన్నాళ్ళు సరదాగా ఎంజాయ్ చేసి నిన్న ఇండియా కి చేరుకున్నారు చరణ్. కాగా అక్కడి పలు అందమైన ప్రదేశాలు చుట్టిన ఈ జంట కొన్ని ఫోటోలు దిగారు. అందులో రెండు బ్యూటిఫుల్ ఫొటోస్ ని కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు ఉపాసన. ఆ ఫొటోల్లో స్టైలిష్ దుస్తుల్లో చరణ్, ఉపాసన ఇద్దరి లుక్స్ అదిరిపోయాయి. కాగా ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు