‘రామ్ చరణ్, సుకుమార్’ ల కొత్త సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే !

ram-charan-suku
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధృవ’ షూటింగ్ లో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం తరువాత చరణ్ ‘సుకుమార్’ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో మొదలుపెడతారని అనుకున్నా ఇప్పుడు నవంబర్ నుండి మొదలుపెడతారని తెలుస్తోంది.

ఈ చిత్రం కంప్లీట్ లవ్ ఎంటర్టైనట్ గా ఉండబోతోంది కనుక ప్రస్తుతం ధృవ కోసం పోలీస్ లుక్ లో ఉన్న రామ్ చరణ్ లవర్ బాయ్ స్టైల్లోకి మారడానికి కాస్త సమయం పడుతుందని ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో మొదలుపెడుతున్నారట. ‘దేవి శ్రీ ప్రసాద్’ సంగీతం అందివ్వబోతున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా దర్శకుడు సుకుమార్ కొత్త హీరోయిన్ ను తీసుకుంటారని కూడా తెలుస్తోంది.