వైరల్ అవుతోన్న రామ్ చరణ్ సూపర్ స్టైలిష్ పిక్

Published on May 25, 2023 7:30 pm IST

కొద్ది రోజుల క్రితమే రామ్ చరణ్ శ్రీనగర్‌లో జరిగిన జి20 సమ్మిట్‌కు హాజరయ్యి, అతని అభిమానులను థ్రిల్ కి గురి చేసాడు. అతని కొత్త చిత్రం ఆన్‌లైన్‌లో కనిపించడంతో నటుడు మరోసారి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రంలో చరణ్ సూపర్ స్మార్ట్ అవతార్‌లో ఉన్నాడు. ఈ సూపర్ స్టైలిష్ పిక్ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. చరణ్ ఆఫ్‌లైన్ స్టైలింగ్ ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది, ఈ పిక్ కూడా అదే రుజువు చేస్తుంది.

మెగా పవర్‌స్టార్ యొక్క ఈ కొత్త అవతార్‌తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కొద్దిసేపటికే సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. వర్క్ ఫ్రంట్‌లో, చరణ్ తదుపరి పొలిటికల్ యాక్షన్ డ్రామా అయిన గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ మైసూర్‌లో త్వరలో ప్రారంభం కానుంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :