వైరల్: సూపర్ కూల్ గా, స్టైలిష్ గా మెగా పవర్ స్టార్!

Published on Nov 24, 2022 3:00 pm IST

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC15 వర్కింగ్ టైటిల్ తో తన రాబోయే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారనే వార్త అందరికీ తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ రోజు, మెగా హీరో తన సోషల్ మీడియా లో, అతని హెయిర్‌ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌తో ఉన్న ఫోటోలను పంచుకున్నాడు.

మరో వారం పాటు న్యూజీలాండ్ లో పాటల చిత్రీకరణ జరగనుండగా, డిసెంబర్ మొదటి వారంలో చిత్ర బృందం హైదరాబాద్‌ కు రానుంది. మిగిలిన భాగాన్ని డిసెంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో రూపొందించనున్నారు మేకర్స్. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :