వైరల్ : కమెడియన్ సత్యని తన స్పెషల్ ఫ్లైట్ లో తీసుకెళ్లిన చరణ్..!

Published on Jul 7, 2022 9:00 pm IST

సిల్వర్ స్క్రీన్ వరకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమాల్లో విజృంభించి బయట మాత్రం చాలా సైలెంట్ గా కనిపిస్తాడు. ఇది తన లేటెస్ట్ భారీ చిత్రం రౌద్రం రణం రుధిరం విషయంలో కనిపించింది. ఇక దీని తర్వాత మరో ఇండియన్ టాప్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా షూట్ లో దాదాపు అందరూ మన తెలుగు ఆర్టిస్టులే నటిస్తుండగా తాజాగా ఓ సంఘటన వైరల్ గా మారింది. ఓ షెడ్యూల్ నిమిత్తం చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ రావాల్సి ఉండగా తన సన్నివేశాలతో పాటుగా కమెడియన్ సత్య కి కూడా సీన్స్ అయ్యిపోయాయని తెలుసుకున్న చరణ్ తనని తన ప్రయివేట్ ఫ్లైట్ లో హైదరాబాద్ కి తీసుకొచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు.

మాములుగా అయితే తన స్టేటస్ కి తనంత వచ్చేసి ఉండొచ్చు కానీ తనతో పాటు తన తోటి ఆర్టిస్టు ని కూడా తనతో సమానంగా తీసుకురావడం అనేది ఆసక్తిగా మారింది. అలాగే ఈ ఇన్సిడెంట్ తో ఇది వరకు కమెడియన్ సత్య తనకి రంగస్థలం టైం లో కూడా రామ్ చరణ్ చాలా సహాయం చేసాడనే వీడియో క్లిప్ లు కొన్ని వైరల్ గా మారుతున్నాయి.

సంబంధిత సమాచారం :