అప్పుడే తన మరో భారీ సినిమాకి రెడీ అయ్యిపోయిన చరణ్.!

Published on Jan 5, 2022 4:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” అనుకోని విధంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లైన్ లో ఉండగానే చరణ్ ఇంకో నెక్స్ట్ లెవెల్ సినిమాని అందులోని ఇండియాస్ మరో స్టార్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో సినిమా అనౌన్స్ చేసి సెన్సేషన్ ని నమోదు చేసాడు.

మరి ఈ సినిమాను కూడా భారీ స్థాయిలోనే ప్లాన్ చెయ్యగా ఆల్రెడీ ఒక షెడ్యూల్ ని కూడా మేకర్స్ కంప్లీట్ చేశారు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చి చరణ్ తన “RRR” సినిమా ప్రమోషన్స్ ని వచ్చాడు. చాలా రోజులు పాల్గొన్నాడు. కానీ అనుకోని రీతిలో ఈ సినిమా వాయిదా పడడంతో మళ్ళీ పెద్ద బ్రేక్ వచ్చింది.

ఇక ఈ బ్రేక్ లో ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా ఈ సమయాన్ని శంకర్ తో సినిమా చేసేయాలని రెడీ అయ్యాడట. ఆల్రెడీ ఈ పనుల్లోనే మేకర్స్ ఉన్నారట. శంకర్ కూడా ఓకే చెప్పడంతో చరణ్ ఆల్రెడీ చెన్నై లో ల్యాండ్ అయ్యినట్టు టాక్. దీనితో జస్ట్ ఈ కొన్ని రోజుల్లోనే ఈ సినిమా కూడా స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజు తన బ్యానర్ లో 50 వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :