ఈ పుట్టిన రోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తా – రామ్‌చరణ్‌

Published on Mar 27, 2022 1:10 am IST

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. భారీ అంచనాలతో మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. చెర్రీ, తారక్ నటనపై మరియు రాజమౌళి డైరెక్షన్‌పై ప్రశంసలు కురిపిస్తూ అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు అందరూ ఆర్ఆర్ఆర్ సినిమాపై పొగడ్తలు గుప్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే నేడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ పుట్టినరోజు కావడంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశాడు. “ఆర్ఆర్ఆర్ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు.. ఎంతో ఉత్సాహంతో ఈ సినిమా చూసిన అందరికీ కృతజ్ఞతలు.. ఈ అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తా” అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో లేఖలు విడుదల చేశాడు.

సంబంధిత సమాచారం :