రణ్ వీర్ సింగ్, రాజమౌళి లకు థాంక్స్ తెలిపిన రామ్ చరణ్!

Published on Sep 8, 2021 10:16 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కనున్న సినిమా నేడు ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం కి రణ్ వీర్ సింగ్ మరియు రాజమౌళి లు విచ్చేసిన సంగతి తెలిసిందే.

సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం కి విచ్చేసినందుకు బాలివుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ కి మరియు దర్శక దిగ్గజం రాజమౌళి గారికి ప్రత్యేక థాంక్స్ తెలిపారు రామ్ చరణ్. ఈ వేడుక కి హాజరు అయి, ఎంతో గ్రాండ్ గా మలిచినందుకు థాంక్స్ అని అన్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ చిత్రం పై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :