సల్మాన్ చిత్రంలో చరణ్ కామియో..వైరల్ అవుతున్న టాక్..!

Published on Jun 21, 2022 7:12 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే దర్శకుడు రాజమౌళి తో ముందు “రౌద్రం రణం రుధిరం” సినిమా చేశాక ఓవరాల్ ఇండియా సహా ఇంటర్నేషనల్ వైడ్ కూడా భారీ రీచ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు చరణ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిత్రంలో చరణ్ కామియో చేస్తున్నట్టుగా ఓ టాక్ మంచి వైరల్ అవుతుంది.

ఇప్పుడు సల్మాన్ మరియు మన టాలీవుడ్ స్టార్ నటుడు వెంకీ మామ కూడా నటిస్తున్న కబీ ఈద్ కబీ దివాళి సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఒక సాంగ్ కోసం అన్నట్లు తెలుస్తోంది. మరి ఇంకా దీనిపై ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా దేవిశ్రీప్రసాద్ మరియు యోయో హనీ సింగ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :