యాక్షన్ ఎంటర్టైనర్ పై దృష్టి పెట్టిన రామ్ చరణ్ ?
Published on Jul 19, 2017 8:48 am IST


ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘రంగస్థలం’ లో నటిస్తున్న రామ్ చరణ్ పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘సినిమా చూపిస్తా మావ, నేను లోకల్’ వంటి పక్కా కమర్షియల్, యాక్షన్ ఎంటరైనర్లను తెరకెక్కించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారట.

ఇంతకుముందే త్రినాథరావ్ చెప్పిన స్టోరీ లైన్ విన్న చరణ్ ఇంప్రెస్ అయి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నాడట. త్రినాథరావ్ నక్కినతో ‘నేను లోకల్’ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు ఈ ప్రాజెక్టుని ప్రొడ్యూజ్ చేస్తారని, సుకుమార్, కొరటాల శివల ప్రాజెక్ట్స్ పూర్తవగానే చరణ్ ఈ సినిమాను స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ అసలు సంగతులేమిటో తెలియాలంటే అధికారిక సమాచారం వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

 
Like us on Facebook