“RC16” కోసం చరణ్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..

“RC16” కోసం చరణ్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..

Published on Jun 20, 2024 7:04 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో “గేమ్ ఛేంజర్” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఇప్పుడు అంతిమ దశలో ఉండగా ఇక అందరి దృష్టి చరణ్ తదుపరి సినిమా తన కెరీర్ 16వ సినిమా పైకి మరలుతుంది. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనుండగా ఈ సినిమా కథపై చాలా స్టార్స్ భారీ లెవెల్లో హైప్ ఇస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం చరణ్ అయితే మాస్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారనున్నట్టుగా తెలుస్తోంది. ఇదివరకు కూడా ఓ టాక్ వినిపించగా ఇప్పుడు మరోసారి వినిపిస్తోంది. ఈ సినిమా కోసం చరణ్ మరోసారి తన బాడీని బిల్డప్ చేయనున్నాడట. అంతేకాకుండా లాంగ్ హెయిర్ లుక్ లోకి కూడా చరణ్ మారనున్నాడని తెలుస్తోంది.

మరి ఇదంతా సిద్ధం అయ్యేసరికి ఒక ఆగస్ట్ నెల వరకు సమయం పడుతుంది అని ఆ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా లేటెస్ట్ టాక్. ఇక ఈ భారీ సినిమాకి ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు