‘రంగస్థలం’ లోకి అడుగుపెట్టబోతున్న చరణ్ !
Published on Jun 11, 2017 9:42 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగస్థలం 1985’ మూడవ షెడ్యూల్ ఇటీవల మొదలైంది. గత కొన్ని రోజులుగా గోదావరి జిల్లాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం నేటి నుంచి చరణ్ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

శుక్రవారం రోజు ఈ చిత్ర టైటిల్ ‘రంగస్థలం 1985’ గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ టైటిల్ కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాక అంచనాల్ని అమాంతం పెంచేసింది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ చెవిటి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తుండడం విశేషం. సమంత హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, ఆదిపినిశెట్టి, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో కీలక పాత్రలను పోషిస్తున్నారు.

 
Like us on Facebook