కన్నడ యంగ్ డైరెక్టర్ తో వర్క్ చేయనున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ?

Published on Dec 27, 2022 1:30 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో RC15 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ స్టార్ క్యాస్టింగ్ తో అలానే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక దీని తరువాత ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన తో తన నెక్స్ట్ మూవీ ఇప్పటికే అనౌన్స్ చేసారు రామ్ చరణ్. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీ అతి త్వరలో పట్టాలెక్కనుంది.

కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ఏమిటంటే, దీని అనంతరం తన తదుపరి RC17 మూవీని కన్నడ యువ డైరెక్టర్ నర్తన్ తో రామ్ చరణ్ వర్క్ చేయనున్నారని అంటున్నారు. ప్రతిష్టాత్మక టాలీవుడ్ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ రూపొందనుందని చెప్తున్నారు. కన్నడ లో ముఫ్తి వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన నర్తన్ ప్రస్తుతం చరణ్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ గురించిన పూర్తి అధికారిక వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయట.

సంబంధిత సమాచారం :