రాజమౌళి సినిమాలో చరణ్ సరికొత్త లుక్ !

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవం ఇటీవలే ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో రాజమౌళి, ఎన్టీఆర్ ని, రామ్ చరణ్ ని సరికొత్త లుక్స్ లో చూపించబోతున్నాడట. తాజాగా రామ్ చరణ్ లుక్ ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్ తీర్చిదిద్దనున్నారు. ఈ భారీ చిత్రంలో చరణ్ లైట్ గడ్డంతో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కనిపించేలా చేస్తాడట హాకిమ్.

మరో వైపు ఎన్టీఆర్‌ కూడా తన లుక్ కోసం కఠినమైన బాడీ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ మొత్తం స్టీవ్స్‌ లాయిడ్‌ ఆధ్వర్యంలో ఆయన చెప్పిన సూచనల ప్రకారం జరుగుతుంది.

ఇక ఈ చిత్రం కోసం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ని రాస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version