‘వన్‌ అండ్‌ ఓన్లీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళి సర్‌’.. చరణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

Published on Oct 2, 2022 11:13 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లను రాబట్టింది. అయితే, ఏంజెల్స్‌లో జరుగుతున్న బీయాండ్‌ ఫెస్ట్‌లో భాగంగా టీసీఎల్‌ ఛైనీస్‌ థియేటర్‌ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఐతే, థియేటర్‌లో సినిమాను వీక్షిస్తున్న ఫారిన్‌ ఆడియన్స్‌ ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్‌తో ఆడిటోరియంను హోరెత్తించారు.

ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి వేదికపై వెళ్లగా అక్కడ ఉన్న ప్రేక్షకులు అందరూ కరతాళ ధ్వనులతో స్టాండింగ్‌ ఓవెషన్‌ ఇచ్చారు. ఆ వీడియోను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘వన్‌ అండ్‌ ఓన్లీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళి సర్‌’ అంటూ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌ గా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేసింది.

సంబంధిత సమాచారం :