‘గాంధీ తాత చెట్టు’ టీమ్‌ను అభినందించిన రామ్ చరణ్, ఉపాసన

‘గాంధీ తాత చెట్టు’ టీమ్‌ను అభినందించిన రామ్ చరణ్, ఉపాసన

Published on Jan 25, 2025 4:00 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాంధీ తాత చెట్టు’ రిలీజ్‌కు ముందే పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులోనూ మంచి బజ్‌తో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని పద్మావతి మల్లడి డైరెక్ట్ చేయగా పూర్తి ఫీల్ గుడ్ చిత్రంగా ఇది శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వంటి వారు కూడా తమ విషెస్ చెబుతూ అంచనాలను పెంచారు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల అభినందించారు. ‘గాంధీ తాత చెట్టు’ వంటి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని నేటి సమాజానికి అందించినందుకు చిత్ర యూనిట్‌ను వారు మెచ్చుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ అందుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలిపారు. ఇక ఈ సందర్భంగా సుకృతి వేణి, చిత్ర దర్శకురాలు, నిర్మాతలతో పాటు తబిత సుకుమార్ కూడా మెగా కపుల్‌ని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు